పాఠ్యాంశంగా కరోనా..!

146
covid
- Advertisement -

ప్రపంచ దేశాలను కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్‌తో ప్రజలు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా విస్తరించగా లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు.

ఇక మనదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా మృతుల సంఖ్య 50 వేలకు చేరువయ్యాయి.

కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల్లో కరోనా -పౌరుల విధులను చేర్చాలని ఎన్సీఈఆర్టీని, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. దీని విధి విధానాలపై కేంద్ర న్యాయవ్యవహారాల విభాగం దృష్టి సారించిందని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -