- Advertisement -
హైదరాబాద్ లో చిరుత పులి తిరగడం కలకలం రేపుతోంది. కూకట్ పల్లిలోని పరిధిలోని గాజులరామారం సర్కిల్, ప్రగతి నగర్ మధ్యలో ఉన్న మిధిలానగర్ లోని అటవీ ప్రాంతంలో చిరుతపులి ఉన్నది. దీంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం సమయంలో వాకింగ్ కు వచ్చేవారు ఈ చిరుతను చూసి, వీడియో తీసారని స్దానికులు చెబుతున్నారు.
దీంతో వెంటనే అటవి అధికారులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి చూసి వెళ్లారని స్దానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత ఎవరికైనా కనిపిస్తే ఆందోళనకు గురికాకుండా సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -