వాహనం ఢీ..చిరుతపులి పిల్ల మృతి

0
- Advertisement -

చిత్తూరు జిల్లా పలమనేరులో చిరుతపులి పిల్లను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుతపులి పిల్ల అక్కడిక్కడే మృతి చెందింది. వి.కోట తమిళనాడు సరిహద్దులో ఈ సంఘటన జరిగింది.

తమినాడు కు వెళ్లే వాహనదారులు వీడియో తీసి సోషియల్ మీడియాలో ప్రచారం చేయగా వైరల్‌గా మారింది. సంఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకోగా వారు వచ్చే సరికే చిరుతపులి పిల్ల కళేబారాన్ని మాయం చేశారు.

ఎవరైనా ఎత్తుకు వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు అయోమయంలో ఉన్నారు. త్వరలోనే అటవీశాఖ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Also Read:నదిలో పడ్డ ట్రక్కు..71 మంది మృతి

- Advertisement -