మన ఆరోగ్యానికి మేలు చేసే సహజసిద్దమైన పదార్థాలలో తేనె ముందు వరుసలో ఉంటుంది. తేనె ఎన్నో పోషకాల సమ్మేళనం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఏమైనో యాసిడ్స్..ఇలా అన్నీ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సర్ఫర్, పొటాషియం, వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి అవసమైన శక్తి క్షణాల్లో లభిస్తుంది. ఇంకా ఆయుర్వేదం, మరియు ఇతరత్రా మెడిసన్ల తయారీలో తేనెను ప్రధాన మూలకంగా ఉపయోగిస్తూ ఉంటారు. సీజనల్ గా వచ్చే వ్యాధుల నిర్మూలన జలుబు,. దగ్గు, కోరంత దగ్గు, గొంతు నొప్పి, మలబద్దకం, అజీర్తి.. ఇలా చాలా సమస్యల నిర్మూలనకు తేనె ను ప్రధానంగా వాడుతూ ఉంటారు. .
కాగా తేనెను అలాగే తీసుకోవడం కంటే ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయట. తేనె ను గోరు వెచ్చని నీటితో కలిపి త్రాగితే, రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య మెరుగుపడుతుందట. ఇక కొందరు పాలలో తేనె కలుపుకొని సేవిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. పాలలో ఉండే ప్రోటీన్స్ అలాగే తేనెలో ఉండే పోషకాలు సమపాళ్ళలో శరీరానికి అందుతాయట. తద్వారా కండరాల పుష్టి ఎముకల పటుత్వం పెరుగుతుంది.
Also Read:Harishrao:గౌరవెల్లి హుస్నాబాద్‌కు వరం
ఇక తేనెనే నిమ్మరసం కలుపుకొని తాగితే అధనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ఊయడం పడగడుపున సేవిస్తే మలబద్దకం, ఛాతీ మంట వంటి సమస్యలు దురమౌతాయి. ఇంకా చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య కూడా దూరమౌతుందట. ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు దగ్గు వంటివాటితో ఉపశమనం లభించడంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా దరిచేరవట. కాబట్టి తేనె నిమ్మరసం కలిపి సేవించడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.