శంకరాభరణం విడుదల రోజే.. శివైక్యం

31
- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనో శిఖరం. ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం. తెలుగు తెరపై తిరుగులేని ముద్ర వేసిన ఘనత ఆయన సొంతం. తెలుగు సంస్కృతికి, సామాజిక చిత్రాలతో ప్రజలను ఆలోచింపచేసిన దిగ్గజ దర్శకుడు. ఆయనే కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించిన సిరిసిరి మువ్వ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహింయారు విశ్వనాథ్. ఆయన సినిమాల్లో శంకరాభరణం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం రిలీజ్ కాగా సరిగ్గా అదేరోజే ఆయన అస్తమించారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ,రాజకీయ ప్రముఖులంతా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.

విశ్వనాథ్ పూర్తిపేరు.. కాశీనాథుని విశ్వనాథ్. వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన టాలీవుడ్‌కి ఎన్నో అపురూపమైన చిత్రాలను అందించారు. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ,సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎవర్‌ గ్రీన్ సినిమాలను తీశారు.

దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తెలుగు సినీ అభిమానులను అలరించారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి హిట్ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ,1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -