చాలమంది ఆహారపు అలవాట్ల విషయంలో అశ్రద్ద చూపిస్తుంటారు. ఎప్పుడు ఏవి తినాలి ఏవి తినకూడదు అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేకుండా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సీజన్ ను బట్టి మన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మార్పులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఫ్లూ వైరస్ ల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. తద్వారా ఇమ్యూనిటీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇమ్యూనిటీ పెరగాలంటే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దుంపలు, ఆకుకూరలు, వేరుశనగ, జొన్నలు.. వంటివి తినడం ఎంతో మేలట. .
దుంపలలో పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సి, ఖనిజాలు, మాంగనీస్, వంటివి మెండుగా ఉంటాయి. ఇవి శరీర వేడిని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇంకా ఆకు కూరలలో ఉండే ఎన్నో పోషకాలు చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇందులో ఉండే క్యాల్సియమ్, ఇనుము, అవయవాలను యాక్టివ్ గా ఉంచడంలో సహాయ పడతాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడతాయి. ఇక వేరుశనగ విటమిన్ బి3 గుండెకు మేలు చేస్తుంది. అంతే కాకుండా చర్మం పొడిబారకుండా తేమ శాతాన్ని పెంచుతుంది. ఇక వింటర్ లో జొన్నలను వారానికి కనీసం రెండు లేదా మూడు సర్లైన తీసుకుంటే ఎంతో మేలట. జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా కండరాల కదలిక బాగా జరుగుతుంది. ఇంకా ఎముకల పటుత్వానికి కూడా దోహదపడుతుంది. ఇవే కాకుండా చలికాలంలో ఉప్మా, ఇడ్లీ, దోసె, బ్రౌన్ బ్రెడ్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ చలికాలంలో శరీర వేడిని పెంచడంలో మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read:బీజేపీ మతవిద్వేషాలు..మానదా?