Google:మరోసారి ఉద్యోగుల తొలగింపు!

19
- Advertisement -

గూగుల్ కంపెనీలో లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గత రెండేళ్లుగా ఉద్యోగాలకు కోత పెడుతున్న గూగుల్…తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది.

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిది వెల్లడించారు. అయితే ఎంతమందిని తొలగిస్తారన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.

తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్‌, చికాగో, అట్లాంటా, డబ్లిన్‌ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లుతెలిపారు.

Also Read;Harishrao:విశ్వసనీయతే ముఖ్యం..పదవులు కాదు

- Advertisement -