బిగ్ బాస్ … చెత్త షో

260
Laxmi Ramakrishnan fire on Bigboss show
- Advertisement -

ప్రస్తుతం టీవీల్లో రియాల్టీ షోల హవా నడుస్తోంది. ఇండియన్ బుల్లితెర రియాలిటీ షోల చరిత్ర లోనే బిగ్ బాస్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన బిగ్‌ బాస్‌ షోకి మంచి స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ షో దక్షిణాదికి పాకింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎంత స్ధాయిలో హిట్ అయిందే అంతే స్‌ధాయిలో ఈ షోపై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనగానే పార్టిసిపెంట్స్ మధ్య రకరకాల కాంట్రవర్సీలూ గొడవలే గుర్తుకు వస్తాయి.

తాజాగా  తమిళంలో పది రోజుల క్రితం ఈ షో ప్రారంభమైంది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు అక్కడ వచ్చిన స్పందన అంతంతమాత్రమే. ఒకరకంగా అక్కడ అది నెగెటివ్ టాక్‌నే మూటగట్టుకుంది. కానీ తెలుగులో ఈ షోకు హోస్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈ నెల 16న ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో  బిగ్ బాస్ షోపై తమిళ నటి  – దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ అదొక చెత్త షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది .ఈ షో వల్ల కుటుంబంలో కలతలు రేగడం ఖాయమని  ఆమె తెలిపింది.  భారతీయతకు ఆ షో చెడ్డ పేరు తీసుకువస్తుందని దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని వ్యాఖ్యానించింది.ఆ షో కారణంగా పార్టసిపెంట్స్ వ్యక్తిగత మనోభావాలు దెబ్బ తింటాయని తెలిపింది. స్వేచ్చగా బతికే వాళ్ల ను ఒక చోట బంధించినట్లు అవుతుందని చెప్పింది.

తనను కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనమని కోరారని పది కోట్ల రూపాయలు ఇచ్చినా నేను ఆ షోలో పార్టిటసిపేట్ చేయనని తెగేసి చెప్పానని అంటోంది. ఈ షో లో ఆడ  – మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి ఒక ఇంట్లో ఉండాలని రెండు నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బ తింటాయని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను ఆ షోలో పాల్గొనడానికి సుముఖత చూపలేదని స్పష్టం చేసింది.

- Advertisement -