- Advertisement -
మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్‌ను ఎందుకు వద్దంటున్నారు చెప్పాలన్నారు సోమ భరత్. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది.. ఈ జడ్జిమెంట్ వచ్చేవరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చాము అన్నారు.
ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాము.. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చి హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకు రావద్దు అనడం ఏంటి అని ప్రశ్నించారు.
ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు.. ఇవాళ అది జరగకూడదని మేము కలిసి వెళ్ళాము అన్నారు. అడ్వకేట్‌ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వ లేదు.. దాని వల్ల మీకు నష్టం ఏమిటి చెప్పాలన్నారు.
Also Read:సిప్లా..డయాబెటిస్ ఇన్‌హెల్లర్
- Advertisement -