పంజాబీ సింగర్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్ బెదిరింపు!

9
- Advertisement -

ప్రముఖ పంజాబీ గాయకుడు, బాలీవుడ్‌లో వరుస సూపర్‌హిట్ పాటలతో పేరు తెచ్చుకున్న బీ ప్రాక్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తీవ్ర బెదిరింపులకు పాల్పడింది. రూ.10 కోట్ల ఎక్స్టార్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గాయకురాలు దిల్నూర్‌కు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు వెల్లడైంది.

జనవరి 5న (సోమవారం) దిల్నూర్‌కు అంతర్జాతీయ నంబర్ నుంచి రెండు కాల్స్ వచ్చాయి. అనుమానంతో ఆమె వాటిని పట్టించుకోలేదు. మరుసటి రోజు జనవరి 6న (మంగళవారం) మధ్యాహ్నం మరో కాల్ రావడంతో కొద్దిసేపు మాట్లాడిన దిల్నూర్, సంభాషణ అనుమానాస్పదంగా మారడంతో కాల్ కట్ చేసింది. వెంటనే అదే నంబర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. తాను జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జు బిష్ణోయ్‌నని, ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని కాలర్ పరిచయం చేసుకున్నాడు.

ఆ వాయిస్ మెసేజ్‌లో “హలో… అర్జు బిష్ణోయ్ మాట్లాడుతున్నా. బీ ప్రాక్‌కు చెప్పు, మాకు రూ.10 కోట్లు కావాలి. మీకు వారం రోజుల సమయం. ఏ దేశానికి పారిపోయినా ప్రయోజనం లేదు. అతనితో కనిపించే ఎవరైనా లక్ష్యంగా మారతారు. ఇది నకిలీ అని అనుకోవద్దు. కలిసి ఉంటే ఉండండి, లేకపోతే అతన్ని మట్టిలో పాతేస్తాం” అంటూ తీవ్రంగా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆడియోను ప్రస్తుతం దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

ఈ బెదిరింపులతో భయభ్రాంతులకు గురైన దిల్నూర్, జనవరి 6న మోహాలీ ఎస్‌ఎస్‌పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈడీ, పోలీసు శాఖలు కలిసి దీనిని తీవ్రమైన ఎక్స్టార్షన్ కేసుగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

- Advertisement -