పార్లమెంటులో పాము.. ఏం జరిగిందంటే..?

476
snake
- Advertisement -

అదేంటి పార్లమెంట్‌లో పాము ప్రత్యక్షమవడం ఏంటనుకుంటున్నారా…?మీరు వింటున్నది నిజమే పార్లమెంట్‌లో పాము ప్రత్యక్షమైంది కానీ అది మన దేశంలో కాదు నైజీరియాలో. ప్రజా సమస్యలపై నైజీరియా పార్లమెంట్ వాడీవేడిగా సాగుతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్‌ నుంచి పాము కింద పడింది. దీంతో అంతా షాక్..భయంతో పరుగులు తీశారు.

మరికొంతమంది ఏం జరుగుతుందో తెలియక బల్లపై నిల్చుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. పాము దెబ్బకు సభను మొత్తం తనిఖీ చేసి అన్నివిధాలా సురక్షితమైన తర్వాతే మళ్లీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ చెప్పారు.

చాంబర్‌లోకి అడుగు పెట్టగానే పెద్ద పాము పైనుంచి పడిందని నైజీరియా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఒలుగ్‌బెంగా ఓమోలే తెలిపారు. పాము వల్ల ఎవరికి హానీ జరగలేదన్నారు. సాధారణంగా ఏ దేశ చట్టసభ అయినా చీమ కూడా దూరనంత సెక్యూరిటీ ఉంటుంది. మరి, పాము ఎలా దూరిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -