మెగా ఫ్యామిలీలో ఇటీవల ఆనందోత్సాహాలు వెల్లివిరిసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్యగా మారారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సంతోషకరమైన సందర్భంలోనే చిరంజీవి గతంలో చేసిన ఓ సరదా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొందరు లింగ వివక్ష ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
గతంలో ఒక కార్యక్రమంలో చిరంజీవి తన కుటుంబంలో ఎక్కువగా మనవరాళ్లే ఉన్నారని, ఒక మనవడు కూడా ఉంటే బాగుంటుందని నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. దీనిపై ఓ జర్నలిస్ట్ వ్యంగ్యంగా ట్వీట్ చేయడంతో విషయం మరింత వేడెక్కింది. ఈ విమర్శలకు మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను, కానీ ఒక సంతోషకరమైన సందర్భాన్ని ఇలా చెడగొట్టడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను ఎంత గౌరవంగా చూస్తారో విమర్శకులకు తెలియదని, ఆయన చేసే సేవల్లో కనీసం 1 శాతం చేసే పురుషులు కూడా చాలా తక్కువేనని లావణ్య వ్యాఖ్యానించారు.
ఆమె పోస్ట్ వైరల్ కావడంతో మెగా అభిమానుల నుంచి భారీ మద్దతు లభించగా, కొందరు ఆమె వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు. వివాదం ముదురుతుండటంతో ఆ జర్నలిస్ట్ తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

