హీరోలకు రిప్లై ఇచ్చిన మోడీ…

200
lauds Rajini, Modi thanks him
- Advertisement -

నల్లధనం అదుపు చేయాలనే ఉద్దేశంతో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, నాగార్జున, కరణ్‌జోహార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, మధుర్‌ భండార్కర్‌, అనిల్‌ కుంబ్లే, కైలాశ్‌ ఖేర్‌, కైలాశ్‌ సత్యార్థి తదితరులు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేయగా.. మోడీ కూడా వారి ట్వీట్లకు పేరు పేరునా రిప్లై ఇవ్వడం విశేషం.

‘హ్యాట్సాఫ్‌ నరేంద్ర మోదీ గారు. కొత్త భారతదేశం ఆవిర్భవించింది. జైహింద్‌’ అరి రజనీకాంత్‌ ట్వీట్‌ చేయగా.. ‘ధన్యవాదాలు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి సంపన్న,
అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం’ అని మోడీ రిప్లై ఇచ్చాడు.

‘సెల్యూట్‌ మోదీ. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ నచ్చే నిర్ణయమిది. ముఖ్యంగా పన్ను చెల్లింపు దారులు’ అని కమల్‌హాసన్‌ ట్వీట్‌ చేయగా.. ‘ఈ నిర్ణయాన్ని బెటర్‌
ఇండియా కావాలనుకుంటున్న నిజాయతీగల పౌరుల ఆసక్తి మేరకు తీసుకున్నాం’అని మోడీ రిప్లై ఇచ్చాడు.

నాగార్జున ట్వీట్‌: ‘అభినందనలు నరేంద్ర మోదీ జీ! పన్ను చెల్లించే మాలాంటి వారిని సత్కరించినందుకు. ఆర్థికంగా బలపడే దిశగా ఇండియా అడుగులు వేస్తోంది’
‘ప్రియమైన నాగార్జున, దీని వల్ల అవినీతి ఆగుతుంది, నల్లధనం, నకిలీ నోట్ల చెలామణీ తగ్గుతుంది’అని మోడీ రిప్లై ఇచ్చాడు.

అనిల్‌ కుంబ్లే ట్వీట్‌: ‘చాలా బాగా చేశారు నరేంద్ర మోదీ సార్‌. మీ వల్ల చాలా గర్వంగా ఉంది’
‘ఇది భారతదేశ అత్యంత స్ఫూర్తిదాయక క్రికెటర్ల నుంచి వచ్చింది, వారి బౌలింగ్‌ చాలా మంది బ్యాట్స్‌మెన్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది (చిరునవ్వు)’అని మోడీ రిప్లై ఇచ్చాడు.

కరణ్‌ జోహార్‌ ట్వీట్‌: ‘ఇది నిజంగా గొప్ప నిర్ణయం. మోదీ దుమ్ము దులిపేశారు’
‘ధన్యవాదాలు కరణ్‌జోహార్‌. భవిష్యత్తు తరాల కోసం మనం కచ్చితంగా అవినీతి రహిత భారతదేశాన్ని తయారు చేయాలి’అని మోడీ రిప్లై ఇచ్చాడు.

రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్‌: ‘నరేంద్ర మోదీ రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి మంచి పని చేశారు’
‘థ్యాంక్‌యూ రితేష్‌ దేశ్‌ముఖ్‌’అని మోడీ రిప్లై ఇచ్చాడు.

మధుర్‌ భండార్కర్‌ ట్వీట్‌: ‘ధైర్యంగా ముందడుగు వేసి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి మన దేశాన్ని ఆర్థికంగా బలపరిచినందుకు నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు’
‘అవును మధుర్‌ భండార్కర్‌, ఇది అభివృద్ధికి ప్రేరణని ఇస్తుంది’ అని మోడీ రిప్లై ఇచ్చాడు.

కైలాశ్‌ సత్యార్థి ట్వీట్‌: ‘మనుషుల్ని అన్యాయంగా అపహరించి తరలించడం, చిన్న పిల్లల చేత పనిచేయించడం నల్లధనం కోసమే. ఈ నిర్ణయం తీసుకున్నందుకు
అభినందనలు నరేంద్రమోదీ’
‘కైలాశ్‌ సత్యార్థి షేర్‌ చేసిన ఓ మంచి పాయింట్‌ ఇది’ అని మోడీ రిప్లై ఇచ్చాడు.

- Advertisement -