మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. రామెజిఫిల్మ్‌సిటిలో మాస్ మహరాజ్ రవితేజ, వెన్నెల కిషోర్‌ల మద్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈరోజు రేపు వికారాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
నటీనటులు.. రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్ కి తదితరులు.