ఉక్రెయిన్‌పై దాడికి సిద్దమైన రష్యా..!

83
russia
- Advertisement -

ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధమైంది రష్యా. బుధవారం ఉక్రెయిన్‌పై దాడి జరిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటల్లో తిరిగి రావాలని కోరారు.

రష్యా నుంచి దాడి జరిగితే ఎదుర్కొనేందుకు సిద్దమైంది ఉక్రెయిన్. ఈ మేరకు ప్రజలకు శిక్షణ ఇస్తోంది ఆ దేశ ప్రభుత్వం. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి రష్యా అదనపు బలగాలను మోహరిస్తుండగా.. సరిహద్దుల్లో వేర్పాటువాదుల దాడులు పెరిగాయని జెలెన్‌స్కీ వెల్లడించారు.

రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా క్రీవ్‌లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది.

- Advertisement -