Sunday, January 26, 2025
Home టాప్ స్టోరీస్ సర్వే రిపోర్ట్.. విజయం ‘వైసీపీ’దే ?

సర్వే రిపోర్ట్.. విజయం ‘వైసీపీ’దే ?

23
- Advertisement -

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి గట్టిగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన.. మూడు ప్రధాన పార్టీలు కూడా ఆల్రెడీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుండడంతో ప్రచార కార్యక్రమాలను కూడా  వేగవంతం చేస్తున్నాయి.. ఇకపోతే ఈసారి గెలుపు విషయంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ జనసేన కూటమి రెండు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత ఉందని, ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ది చెబుతారని టీడీపీ జనసేన కూటమి చెబుతుంటే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, ప్రజలు తిరిగి వైసీపీకే పట్టం కడతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనేది అంచనా వేయలేని విధంగా మారింది. .

అయితే ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో మెజారిటీ సర్వేలన్నీ వైసీపీకే తిరిగి పట్టం కడుతూ వచ్చాయి. తాజాగా న్యూస్ ఏరినా అనే సంస్థ నిర్వహించిన సర్వే కూడా వైసీపీకే పట్టం కట్టింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 122 సీట్లు సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని.. ఈ కూటమి కేవలం 55 సీట్లకే పరిమితం అవుతుందని న్యూస్ ఏరినా సర్వే తేల్చి చెప్పింది.

ఇక మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల ప్రభావం ఏ మాత్రం కనిపించదని ఈ రెండు పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అయితే గత ఎన్నికలతో పోల్చితే వైసీపీకి ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉందని, అయినప్పటికి మేజిక్ ఫిగర్ సీట్లను వైసీపీ అలవోకగా సాధిస్తుందని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. అయితే ఎన్నికల ముందు సర్వేలు సర్వసాధారణమని వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఏపీ ప్రజల నాడీ ఎలా ఉందో తెలియాలంటే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

- Advertisement -