ఆ తప్పే ఉదయభాను కెరియర్‌ ను నాశనం చేసిందా?

65
- Advertisement -

యాంకర్‌ ఉదయభాను… ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల భామ ఇప్పుడు నాటి వైభవాన్ని కోల్పోయిందనే చెప్పాలి. యాంకరింగ్‌ రంగానికే గ్లామర్‌ అను అద్ది… అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉదయభాను ఇప్పుడు దాదాపుగా ఫేడవుట్ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఏకంగా హీరోయిన్‌ మెటీరియల్‌ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే ఉదయభాను కెరియర్‌ ఒక్కసారిగా ఎందకు అర్ధాంతరంగా ముగిసిపోయింది. స్టార్‌ యాంకర్‌ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఎందుకు ఉన్నట్టుండి కనుమరుగైంది అన్నచర్చ సోషల్‌ మీడియాలో హాట్‌ టాఫిక్‌ గా నడుస్తోంది.

ఉదయభాను ఉందంటే చాలు.. ఆ షో హిట్‌… ఉదయభాను కోసమే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు అన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే ఉదయభాను కెరియర్‌ టాప్‌ రేంజ్‌ లో కొనసాగుతున్న సమయంలోనే ఆమె చేసిన తప్పులే తనకు ఇబ్బందిగా మారాయన్న టాక్‌ వినిపిస్తోంది. యాంకర్‌ గా టాప్‌ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే ఆమె ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాఫిక్‌ మారడం.. తర్వాత కొంత కాలానికి అతనితో విడిపోయి ఒంటరిగా ఉండడం ఉదయభాను కెరియర్‌ లో ఇబ్బందికరమైనదనే చెప్పాలి. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు కూడా తనకు సహకరించకపోవడంతో ఉదయభాను తీవ్ర డిప్రెషన్‌ లోకి వెళ్లినట్టు కూడా చర్చ జరుగుతోంది.

అయితే కొంత కాలానికి జరిగిన సంఘటన నుంచి తేరుకుని మళ్లీ మామూలు స్థితికి వచ్చి తన కార్యక్రమాల్లో బీజీగా మారింది. తర్వాత కొంత కాలానికి ఉదయభాను తిరిగి రెండో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లైనా ఉదయభానులో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఉదయభాను మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -