టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారువారి పాట’.కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోంది. ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం.. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నారు. తాజాగా ‘సర్కారువారి పాట’ సినిమా కేస్టింగ్‌కు సంబంధించిన కొన్ని లీకులు అందాయి.
ఈ మూవీలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారట. ఆయన ఇందులో క్రూక్డ్ బిజినెస్ మ్యాన్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఆస్తులకు సంబంధించిన వేలం జరుగుతున్నప్పుడు పోటీగా ఎవరూ లేకుండా చూసుకోవడం ఈయన పద్ధతట. ఇక ‘ఒక్కడు, పోకిరి’ తర్వాత ఆ స్థాయిలో మహేష్ చేస్తోన్న ఊరమాస్ పాత్రను మళ్ళీ ఇందులోనే చేస్తున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్ దీపావళికి రాబోతోందని తెలుస్తోంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా, జనవరి 13వ తేదీన ఈ మూవీ విడుదల చేయనున్నారు.