పాత పెద్ద నోట్ల చెల్లుబాటుకు ఈనెల 24తో గడువు ముగియనుంది. ప్రభుత్వ సంస్థల్లో ఈనెల 24వరకు రద్దైన పెద్దనోట్ల చెట్టుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం సమయం నేటితో ముగిసిపోనుంది. ఇకనుంచి ప్రభుత్వ సంస్థల్లో కూడా రద్దైన పెద్ద నోట్లు చెల్లుబాటు కానట్టే. పెద్ద నోట్లతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
కొత్త నోట్లు అందుబాటులో లేక..పాత నోట్లు చెల్లుబాటు కాక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దీంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ సంస్థల్లో పాత నోట్లు చెలామణి అయ్యేలా వీలు కల్పించింది. ప్రభుత్వ సంస్థలైన ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంకులు, ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ షాపులు, గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ రుణాలు మొదలైన వాటిలో పాత పెద్ద నోట్లు చెల్లుబాట అయ్యేలా వీలు కల్పించారు.
అయితే మొదట ప్రభుత్వం ఈనెల 14 న చివరి గడువుగా ప్రకటించారు. పెద్ద నోట్లు రద్దైన 6 రోజులకు కూడా సమస్య అదుపులోకి రాకపోవడంతో..ఆ గడువును ఈనెల 24వరకు పొడిగించారు. గురువారంతో ఆ గడువు కూడా ముగిసిపోనుంది. దీంతో ఇకపై పెద్ద నోట్ల చెల్లుబాటుకు..పుల్ స్టాప్ పడ్డట్టే. ఇక రద్దైన 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకు లో మాత్రమే డిపాజిట్ చేయాలి. టోల్ గేట్ల దగ్గర ఫీజు రద్దు కూడా 24వ వరకు చివరి గడువు. శుక్రవారం అర్ధ్రరాత్రి నుంచి టోల్ రసుం చెల్లించాల్సిందే.