మళ్లీ 2059లోనే….స్వామి వారి దర్శనం..!

666
athi varadar
- Advertisement -

48 రోజుల పాటు లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చిన అత్తిరవదస్వామి నేడు జనం నుంచి జలంలోకి వెళ్లనున్నారు. తమిళనాడులో ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన వరదరాజ స్వామి వారిని పలువురు ప్రముఖులతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఇక నేటితో 48 రోజులు పూర్తి కావొస్తుండటంతో స్వామి వారు తిరిగి 40 ఏళ్ల తర్వాత అంటే 2059లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జీవితంలో ఒక్కసారైనా స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించాలని వేయి కళ్లతో ఎదురుచూసిన వారంతా కంచికి పోటెత్తారు. ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా 40 ఏళ్లపాటు నీటిలో ఉండి, మండల కాలం పాటు భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సారి స్వామివారిని కోటి మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ప్రభుత్వ అంచనా. 40 సంవత్సరాల తర్వాత కోనేటి నుంచి బయటకు వచ్చిన అత్తివరదరాజస్వామి 31 రోజులు శయన రూపంలోను 17 రోజులు స్థాన మూర్తిగా నిల్చొని దర్శనమిచ్చారు. 40 ఏళ్లకోసారి దర్శనం ఏర్పాటు చేసే సంప్రదాయం 1854 నుంచి కొనసాగుతోంది. 1892, 1937, 1979 తర్వాత ఈ ఏడాదిలో మళ్లీ ఈ మహా క్రతువును నిర్వహించారు.

- Advertisement -