అలర్ట్‌..పెండింగ్ చలాన్‌ చెల్లించారా?

35
- Advertisement -

ట్రాఫిక్ మరికొన్ని పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్‌ 26న ప్రారంభమైన ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్స్ ఉండగా..నిన్నటివరకూ వరకు కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో చలాన్స్‌‌‌‌ క్లియర్ అయ్యాయి. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ఇవాళ సాయంత్రం వరకే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎవరైనా పెండింగ్‌ చలాన్‌లను చెల్లించకపోతే..వారు వెంటనే చలాన్ చెల్లించాలనీ, మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని చెబుతున్నారు.

Also Read:మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

- Advertisement -