ఆ దర్శకుడికి ఇదే చివరి అవకాశం

20
- Advertisement -

భోళా శంకర్ తో దర్శకుడిగా మెహర్ రమేష్ నిలబడతాడు అనుకుంటే.. మళ్లీ మొదటికి వచ్చింది మ్యాటర్. నిజానికి ఒక దర్శకుడికి జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఒక పరాజయం తర్వాత దానిని మరిచిపోయే విజయాన్ని ఇస్తేనే ఎవరైనా లైమ్ లైట్ లో వుంటారు. కానీ, ఒక పరాజయం తర్వాత దానిని మించిన పరాజయం ఇచ్చుకుంటూ పోతే.. ఏమిటి పరిస్థితి ?, ప్రస్తుతం మెహర్ రమేష్ అనుభవిస్తున్న పరిస్థితి అదే. దర్శకుడిగా మెహర్ రమేష్ కు ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. ఆయనకు మొదటి సినిమా నుంచి ఫ్లాఫ్ అలవాటే.

జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమా ప్లాప్ దగ్గర నుంచి మెగాస్టార్ తో భోళా శంకర్ వరకూ.. మెహర్ రమేష్ ఖాతాలో అన్నీ డిజాస్టర్లే ఉన్నాయి. భోళా శంకర్ పరాజయం తర్వాత మళ్ళీ మెహర్ రమేష్ కోలుకుంటారనే నమ్మకం లేదు. అందరూ ఇదే భావించారు. కానీ మెహర్ రమేష్ కి ఇప్పుడు ఓ అవకాశం వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మెహర్ రమేష్ కి ఫోన్ వెళ్ళింది. మూడు కోట్ల బడ్జెట్ లో ఓ సినిమా చేయగలరా ? అని. 100 కోట్ల భోళా శంకర్ నుంచి మూడు కోట్ల సినిమాకు పడిపోయాడు మెహర్ రమేష్. నిజానికి ఈ అవకాశం కూడా మెహర్ రమేష్ కి రావడం గొప్పే.

Also Read:పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

కాబట్టి.. మెహర్ రమేష్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మెహర్ రమేష్ కి చాలా కీలకం. ఫైనల్ ఛాన్స్ అనుకోవాలి. రమేష్ కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఆశ పడుతున్నాడు. మెహర్ కి హిట్ వస్తేనే డైరెక్టర్ల రేసులో వుంటాడు. లేకపోతే ఇక ఆ తర్వాత మూడు కోట్ల సినిమా కూడా రాదు. కాబట్టి.. ఈ సినిమాతో మెహర్ రమేష్ హిట్ కొత్త ఫామ్ లోకి రావాలనే కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మెహర్.

Also Read:జమిలి ఎలక్షన్స్.. సీక్రెట్ స్ట్రాటజీ?

- Advertisement -