సాహో..కాపీ కొట్టడం కూడా రాలేదు:ఫ్రెంచ్ డైరెక్టర్

532
sahoo copy
- Advertisement -

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ దర్శకుడు జెరో సల్లే …సాహో మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

తన సినిమాను కాపీ కొట్టినా దానిని సక్రమంగా తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. రెండోసారి లార్గో వించ్ ను ఫ్రీమేక్ చేశారని ..’సాహో’ తనకు నచ్చలేదని అన్నారు. తన సినిమాను స్పూర్తిగా తీసుకున్నారని.. కానీ కాస్త చూసుకొని రీమేక్ లు చేయాలని సలహా ఇచ్చారు.

గతంలో పవన్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీపై జేరోం విమర్శలు గుప్పించారు. తను రూపొందించిన ‘లార్గో వించ్’ను కాపీ కొట్టారని ఆరోపించారు. తాజాగా సాహోపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.

- Advertisement -