ఈరోజు అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పూర్ణచంద్రుడు ఆకాశంలో పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 70 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అద్భుత అవకాశాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని నాసా తెలిపింది. భూమికి దగ్గరగా రావడంతోనే చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. 1948లోనూ పూర్ణచంద్రుడు ప్రకాశవంతంగా కనిపించినా ఎక్కువ మంది ప్రజలు చూడలేకపోయారని నాసా తెలిపింది. మళ్లీ ఇలాంటి అద్భుతం కనిపించాలంటే 25-11-2034 వరకు ఆగాల్సిందే.
దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న భూమికి చంద్రుడు కొన్ని సమయాల్లో దగ్గరగానూ మరికొన్ని సమయాల్లో దూరంగా జరుగుతాడని నాసా తెలిపింది. భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. చంద్రుడికి భూమి దూరంగా జరుగడాన్ని అపోజీ అని, దగ్గరగా వచ్చేదానిని పెరిజీ అంటారు. సాధారణంగా కనిపించే దానికంటే 14 శాతం పెద్దదిగా చంద్రుడు కనిపించనున్నాడు. అంతేగాక 30 శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు అని చెబుతున్నారు నాసా సైంటిస్టులు. భూమికి సుమారు 3 లక్షల 56వేల 508 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు కనిపించనున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 16న కనిపించిన పున్నమి చంద్రుడి కంటే కూడా ఇవాల్టి చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. వచ్చే నెల 24న కూడా భూమికి దగ్గరగా వచ్చినా.. దీనికంటే చిన్నదిగానే ఉంటుందంటున్నారు. ఈ అద్భుతాన్ని భారత్‌లోనూ చూడొచ్చని నాసా సైంటిస్టులు తెలిపారు. సూపర్‌మూన్ చూసేందుకు శాస్త్రజ్ఞులు, రీసెర్చులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలకు సూపర్ మూన్‌తో పాటు చంద్రగ్రహణాన్ని ఒకే రోజు చూసే అవకాశం ఉంది. అయితే ఈ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రమే సూపర్ మూన్‌ను చూసే అవకాశముంది. భారత్ లో ఈరోజు రాత్రి 7.22 గంటలకు సూపర్ మూన్ కనువిందు చేయనుందన్నారు సైంటిస్టులు. రాజస్థాన్ లోని జైసల్మీర్ లో పున్నమి చంద్రుడు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాడని తెలిపారు.
మరోవైపు ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతు గ్రహం సంచరిస్తున్న టైంలో చంద్రగ్రహణం సంభవిస్తుందని… ఈ గ్రహణం కనిపించకపోయినా.. మేషం నుంచి మీనం వరకూ అన్ని రాశులపైనా గ్రహణ ప్రభావం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.