లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శ్రీ, ఎస్తేర్, నోయల్ ,అర్జున్ మీనన్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాతలు. క్రాంతి వడ్లమూడి దర్శకుడు. షెడ్యూల్ చివరి రోజున చిత్ర సెట్ లో యూనిట్ సభ్యులందరూ పాల్గొనగా హీరో శ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…“ప్రధాన తారాగణమంతా పాల్గొనగా తొలి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాము. `సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే చిత్రమిది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ..“నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి సహకారం అందించడంతో తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేశాము. ఈ షెడ్యూల్ చివరి రోజున లొకేషన్ లో హీరోల్లో ఒకరైన శ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో శ్రీ మాట్లాడుతూ…“దర్శకుడు క్రాంతి నా కోసం ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ రోల్ డిజైన్ చేశారు. ఈ పాత్రలో నన్ను చాలా కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు నన్ను నేను స్ర్కీన్ పై చూసుకుంటానా అన్న ఉత్సాహంతో ఉన్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కిరికీ మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
శ్రీ, నోయల్, ఎస్తేర్, అర్జున్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః చేతన్ మధురాంతకం; సంగీతంః గీతా పూనిక్; ఎడిటర్ః తమ్మిరాజు, డైలాగ్స్ః టైమ్ నాని; పిఆర్వోః వంగాల కుమారస్వామి (బాక్సాఫీస్) ;ప్రొడక్షన్ కంట్రోలర్ః బి.సి.చౌదరి; నిర్మాతలుః కృష్ణ మోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి; రచన-దర్శకత్వంః క్రాంతి వడ్లమూడి