రియల్ వ్యవహారమే కాల్పులకు కారణం:డీసీపీ

29
- Advertisement -

హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ రౌడీషీటర్ మృతిచెందాడు. మరో వ్యక్తి జహంగీర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరపడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మాదాపూర్‌ కాల్పుల ఘటనకు రియల్‌ఎస్టేట్‌ వ్యవహారమే కారణమని బాలానగర్‌ డీసీపీ సందీప్‌ రావు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌పై జిలానీ నాటుతుపాకీతో కాల్పులు జరిపాడని వెల్లడించారు.

సంగారెడ్డిలో ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ కలిసి రియల్‌ ఎస్టేట్ చేస్తున్నారు. జహీరాబాద్‌లో భూ లావాదేవీలు గొడవకు దారితీశాయి. జిలానీపై గతంలో కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అని చెప్పారు.

- Advertisement -