లంబాడీలను అవమానపరిచి కించపరిచే విధంగా మాట్లాడిన పిసిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని లేనియెడల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లంబాడీల ఓట్లు బలమైన వున్న చోట ఓడిస్తామని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు భూక్య కోటియ నాయక్ , గుగులోతు బీమా నాయక్ హెచ్చరించారు.శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు కోటియా నాయక్, భీమా నాయక్,శరత్ నాయక్,అశోక నాయక్ లు మాట్లాడుతూ లంబాడీల ఎదుగుదలను ఓర్వని రేవంత్ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తామని తెలిపారు.. లంబాడి జాతి అణిచివేతకు కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లంబాడీలనే ఎస్టీ జాబితాలో నుండి తీసేసే ప్రయత్నం ఎమ్మెల్యేల సీట్లు కేటాయించడంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ,అందుకనే ఖానాపూర్ లో 4 లంబాడీ మిత్రుల చావు కు కారణమైన ఎడమ భోజు కు ఇచ్చారని, లంబాడీల ఓట్లు 10 వేలు లేని చోట్ల లంబాడీలకు సీట్లు ఇచ్చి లంబాడీలను ఓడించాలని, రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు…
బోథ్ ,ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆదివాసీలు మిత్రులు ఎక్కువ వున్న చోట లంబాడీలకు సీట్లు ఇచ్చి లంబాడీలను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.బోథ్ నియోజకవర్గంలో సోయం బాబురావును గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ నుండి 2 నుండి 3 వేల ఓట్లు వున్న నాయక్ పొడ్ వర్గానికి సీటు కేటాయించి ఇన్ డైరెక్ట్ గా సాయం బాబురావుని గెలిపించాలని బలమైన కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని వారు తెలిపారు.
మొత్తానికి అదిలాబాద్ జిల్లాలో లంబాడీల పతనం కావాలని, అటు ఎడమ భొజు , ఇటు సోయం బాబురావ్ , అక్కడ అదిలాబాద్ TRS ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలని,తద్వారా లంబాడీల లీడర్ షిప్ లేకుండా కాంగ్రెస్ పార్టీలోనీ ఉన్న అగ్రకులాహంకారి, పెత్తందారి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మా ఆదివాసీ బిడ్డ సితక్కలు కుట్రలు చేయడం సరి కాదని తెలిపారు.
దాంతో పాటు లంబాడి హక్కుల కోసం, గిరిజన జాతి అభివృద్ధి కోసం పనిచేస్తున్న హక్కులనేత బెల్లయ్య నాయక్ గారికి టికెట్ ఇవ్వకుండా , దొర గడి లో బానిసగా వుంటు పైసల కోసం పల్స్ చూసే డాక్టర్ వృత్తి చేస్తున్న వారికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు….అంటే హక్కుల కోసం పోరాడే నాయకులకు టికెట్ ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయమని అడుగుతారని భయం తో టికెట్ ఇవ్వట్లేదని వారు తెలిపారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముసుగులో రెడ్ల రాజ్యం స్థాపించడం కోసం సొంత ఎజెండా కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పని చేయట్లేదని, దాంతోపాటు దళితులు గిరిజనులకు కింది కులాలను తొక్కేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని తెలిపారు….ఇప్పటికైనా యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. దాంతోపాటు లంబాడిలకి గుడుంబా పోస్తే ఓటు వేస్తారు అని నీచంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పై ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వారిని బహిష్కరించాలని లేనియెడల 3 నియోజకవర్గాల్లో ముగ్గురిని తప్పకుండా ఓడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో LSO రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్,LHPS రాష్ట్ర నేతలు బిక్షం నాయక్, శక్రు నాయక్, సైదా నాయక్,లంబాడీల న్యాయవాదుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బానోతు రమేష్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా రమేష్ చౌహాన్ నాయక్, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేందర్ నాయక్, LSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగిలాల్ నాయక్, శివ వర్మ నాయక్,నాగేశ్వరరావు నాయక్, శోభన్ నాయక్, రాష్ట్ర నాయకులు సైదా నాయక్, రమావత్ సక్రు నాయక్, వెంకట్రావు నాయక్, లక్ష్మణ్ నాయక్, తరుణ్ నాయక్,మోహన్ నాయక్, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Also Read:హరీశ్ శంకర్… “ప్రేమకథ”