లాలూ ప్రసాద్‌కు మరో బిగ్ షాక్.!

83
lalu
- Advertisement -

ఆర్జేడీ నేత,బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. దొరండా ట్రెజ‌రీ నుంచి అక్ర‌మ‌రీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్ర‌త్యేక సీబీఐ కోర్టు లాలూను దోషిగా నిర్దారించింది. జ‌డ్జి సీకే శ‌శి ఆదేశాల మేర‌కు లాలూ ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజ‌రుకాగా గట్టిషాక్ తగిలినట్లైంది.

దాణా కుంభ‌కోణంలో దొరండా ట్రెజ‌రీ కేసులో అయిద‌వ‌ది. 1996లో తొలిసారి దొరండా ట్రెజ‌రీ కేసు న‌మోదు అయ్యింది. ఆ స‌మ‌యంలో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో లింకు ఉన్న 55 మంది ఇప్ప‌టికే మ‌ర‌ణించారు.

దాణా కుంభ‌కోణం కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష ప‌డ‌గా.. లాలూ ఇప్ప‌టి వ‌ర‌కు 3.5 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు.

- Advertisement -