లక్ష్మీ కటాక్షం…రిలీజ్ డేట్

26
- Advertisement -

మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ డైలాగ్ పోస్టర్ & ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. పొలిటికల్ సేటైరికల్ డ్రామా తో వచ్చిన ఈ ‘లక్ష్మీ కటాక్షం’ కాన్సెప్ట్ తనకంటూ ఒక మార్క్ క్రీయేట్ చేసుకుంది. ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని నాయకులని ముప్పు తిప్పలు పెడుతూ డ్రామా తో పాటు, హాస్యం రెండు కలగలిపిన కథ ‘లక్ష్మీ కటాక్షం’.

ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హోరు ఇంకో పక్క ఆ ఎన్నికలకే సెటైరికల్ గా వస్తున్న ‘లక్ష్మీ కటాక్షం’ U/A సర్టిఫికెటును తెచ్చుకొని మే 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

నటీ నటులు:
వినయ్
అరుణ్
దీప్తి వర్మ
చరిస్మా శ్రీకర్
హరి ప్రసాద్
సాయి కిరణ్ ఏడిద
ఆమనీ

- Advertisement -