లక్ష కోట్ల మెగా ప్రిన్సెస్ డిశ్చార్జ్

55
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పడంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైద్యులు చెబుతున్నారు. డిశ్చార్జ్ అయిన అనంతరం వెంటనే రాంచరణ్ దంపతులు అపోలో ఆస్పత్రి వద్ద ఉన్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, సమావేశంలో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలతో పాటు పాప ఫొటోలు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాప పుట్టడంతో మెగా హీరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్ష మంది అనాథలకు దాదాపు 85 రకాల వంటకాలతో అన్నదానం చేయడానికి రామ్ చరణ్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాదు చరణ్ ఇంట్లో పని వాళ్ళందరికీ బోనస్‌లు కూడా ప్రకటించారని సమాచారం. పాప పేరు గురించి కూడా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ కు హీరోయిన్స్‌లలో అలనాటి తార అంజలీ దేవి చాలా ఇష్టమట. ఇక తన నాన్నమ్మ పేరు కూడా అంజనా దేవీ.

Also Read: దళపతి విజయ్…’లియో’

దీంతో వీరిద్ధరి పేర్లు కలుస్తాయని, తన కూతురుకు అంజలి అనే పేరు పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు టాక్. ఇంతకీ మెగా ప్రిన్సెస్ ఆస్తి విలువ లక్ష కోట్లకు పైమాటే ఉంటుందని సమాచారం. ఇందులో ఉపాసన వాటానే ఎక్కవ ఉంటుందని అంచనా.

Also Read: నిఖిల్..‘స్పై’పవర్ ప్యాక్డ్ ట్రైలర్

- Advertisement -