లగడపాటిది పనికిమాలిన సర్వే..జగనే సీఎం:చిన్నికృష్ణ

307
chinni
- Advertisement -

సర్వేల పేరుతో లగడపాటి రాజగోపాల్ చెప్పింది సోది అని ఎద్దేవా చేశారు సినీ రచయిత చిన్ని కృష్ణ. సోమవారం మీడియాతో మాట్లాడిన చిన్నికృష్ణ అన్ని సర్వేలు జగన్ సీఎం అవుతారని చెబుతుంటే లగడపాటి ఒక్కడే చంద్రబాబుకు జై కొట్టారన్నారు.

వెంకన్న సాక్షిగా లగడపాటి పచ్చి అబద్దాలు మాట్లాడరని ఆయనది పనికిమాలిన సర్వే అన్నారు. లగడపాటి సర్వే చేయాల్సింది ఆయన కుటుంబంలోని వారికి సినిమాలు ఎలా తీయాలని నేర్పాలని చురకలంటించారు.

బ్యాంక్ లకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర లగడపాటి తమ్ముడిదని ..వేల కోట్లు ఎగ్గొట్టి సర్వేల పేరుతో చెప్పడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. 2024లో కూడా జగనే ముఖ్యమంత్రని తేల్చిచెప్పారు.

సినిమా వాళ్లు మేకప్ వేసుకుంటే సీఎం కారని పవర్ స్టార్ మళ్లీ సినిమాలు చేయాల్సిందే అన్నారు.పవన్ తర్వాత చేసే మూవీకి నిర్మాత రెడీగా ఉన్నారని చెప్పారు.

ఫలితాలు వచ్చి జగన్ సీఎం ఐనా కూడా చంద్రబాబు నమ్మరని..గెలిస్తే ఒక మాట ఓడిపోతే చంద్రబాబు ఇంకో మాట మాట్లాడతారని చెప్పారు.టీడీపీకి 50 సీట్ల లోపే వస్తాయని జోస్యం చెప్పారు.

- Advertisement -