మాజీ ఎంపీ లగడపాటివి సర్వేలు కావు చిలుకజోస్యాలని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఈ మేరకు ట్వీట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్ నవంబర్ 20న టీఆర్ఎస్ 65-70 సీట్లు గెలుస్తుందని చెప్పిన లగడపాటి ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గే ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని లగడపాటి సర్వేపై స్పందించాల్సి వస్తుందన్నారు.
The reason I dismiss Rajgopal’s survey as concocted; 👇his message to me on 20th Nov that TRS is winning 65-70 seats
It’s the same survey he shared today under pressure from CBN with cooked up numbers
P.s: I had no choice but to share this conversation to break the conspiracy pic.twitter.com/vUJ77KpmFc
— KTR (@KTRTRS) December 4, 2018
ముషిరాబాద్ రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్ టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు. ఏదో ఒకటిచేసి గందరగోళం సృష్టించేందుకు సర్వేలు చేస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు, లగడపాటి వంటి పొలిటికల్ టూరిస్టులు డిసెంబర్ 11 తర్వాత తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేందేమీలేదని.. ఆ పార్టీకి ఓటువేస్తే మూసీలో వేసినట్టేనన్నారు.