- Advertisement -
37 రోజుల తర్వాత లగచర్ల రైతులు విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై సంగారెడ్డి జిల్లా కంది జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 17 మంది రైతులు శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు.
నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. అయితే ఇదే కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ నెల 18న బెయిల్ మంజూరు చేసింది.
గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందగా ఇవాళ ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. జైలు బయట రైతులకు బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన నిందితుడు సురేశ్ సహా మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.
Also Read:ఫార్ములా ఈ…వాస్తవాలివే!
- Advertisement -