యాషెస్ సిరీస్..ఆసీస్ జట్టు ఇదే

7
- Advertisement -

యాషెస్ సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ 15 మందితో కూడిన జట్టులో జేక్ వెదరాల్డ్‌, మార్నస్ లాబుషేన్ లకు చోటు దక్కింది. అలాగే షాన్ అబ్బాట్ మరియు బ్రెండన్ డాగెట్ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు.

31 ఏళ్ల వెదరాల్డ్, గత సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టాస్మానియా తరఫున 18 ఇన్నింగ్స్‌ల్లో 906 పరుగులు సాధించి, సగటు 50.33తో నిలిచాడు.

ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), షాన్ అబ్బాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లయన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బో వెబ్స్టర్.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

- Advertisement -