బీసీలను దగా చేసిన కాంగ్రెస్!

2
- Advertisement -

చట్ట సభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీ లను మోసం చేసిందన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఎన్నికల్లో బీసీ లకు టిక్కెట్లు తక్కువ కేటాయించిన పార్టీ కాంగ్రెస్..ఓడిపోయే స్థానాల్లో కాంగ్రెస్ బీసీ లకు టిక్కెట్లు ఇచ్చిందన్నారు. పార్టీ పరంగా 42 శాతం టిక్కెట్లు ఇస్తాం అని రేవంత్ రెడ్డి అనడం బీసీ లకు దగా చేయడమే..చట్టబద్దత చేసే దాకా కాంగ్రెస్ ను విడిచి పెట్టం అన్నారు.

అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి బీసీ లను సమాయత్తం చేస్తాం ..బీసీ లను గౌరవించింది ముమ్మాటికీ కేసీఆర్ ..బీసీ లకు ఆత్మగౌరవ భవనాలు కట్టించింది కేసీఆర్ యే అన్నారు. ఇద్దరు బీసీ లను రాజ్యసభ కు పంపింది బీ ఆర్ ఎస్ యే …2004 లోనే కేసీఆర్ నేతృత్వం లో బీసీ సంఘాలు అప్పటి ప్రధాని ని కలిసి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరాయి అన్నారు.

కేసీఆర్ దృష్టిలో బీసీలంటే రాష్ట్రానికి వెన్నెముక .. అసెంబ్లీ నిన్న ఎందుకు పెట్టినట్టు ?బీసీ ల కోసం చట్టం చేశారా ?..ఎందుకు ఇంత హడావుడి ?..నెల రోజులు టైమ్ అయినా తీసుకోండి ..బీసీ ల సంఖ్య సరిగా చెప్పండి అన్నారు. నిన్న ఏ బీసీ సంబరాలు చేసుకోలేదు .కేవలం గాంధీ భవన్ లోనే సంబరాలు చేసుకున్నారు ..రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కులాల వారీగా జనాభా ఎంతో బయట పెట్టాలన్నారు.

Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

- Advertisement -