విజేత‌గా నిలిస్తే… ఏదైనా చేస్తా… కానీ చెప్ప‌ను

260
KXIP win IPL 2018? KL Rahul asks Preity Zinta
- Advertisement -

ఐపీఎల్-11 హోరా హోరీగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తుంది. పంజాబ్ విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తుండ‌డంతో ఆ జట్టు స‌హ య‌జ‌మాని ప్రితీ జింతా సంతోషంలో మునిగితేలుతున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో పంజాబ్ జ‌ట్టు ఒక్క‌సారి కూడా విజేత‌గా నిల‌వ‌లేక‌పోయింది. కోల్‎క‌త్తా నైట్ రైడ‌ర్స్‎తో జ‌రిగిన మ్యాచ్‎లో పంజాబ్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

KXIP win IPL 2018? KL Rahul asks Preity Zinta

మ్యాచ్‌ అనంతరం ప్రీతి జింతా పంజాబ్‌ జట్టు ఆటగాడు కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఈ ఏడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ విజేతగా నిలిస్తే ఏం చేస్తారు అని అడ‌గ‌గా..  జట్టు కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా. అదేంటో ఇప్పుడు మాత్రం చెప్ప‌ను అని చెప్పేసింది. ఇలాగే ప్రతి మ్యాచ్‎లో విజ‌యభేరి మోగించాల‌ని కోరుకుంటున‌న్నారు. కోల్‎క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్‎లో 9 వికెట్ల తేడాతో విజ‌యభేరి మోగించింది.

ఇక ఐపీఎల్ వేలంలో ఎవ‌రూ తీసుకోని క్రిస్‎గేల్ ని పంజాబ్ జ‌ట్టు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క ఆట‌గాడిగా మారాడు గేల్. సిక్స‌ర్ల‌తో, బోండ‌రీల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు గేల్. మరోవైజు కేఎల్ రాహుల్ కూడా త‌న దైన శైలిలో జ‌ట్టు గెలుపుకి కృషి చేస్తున్నాడు.

- Advertisement -