తమిళ సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచారు ప్రముఖ నటి, నిర్మాత కుట్టి పద్మిని. శ్రీరెడ్డికి తాను అవకాశాలు ఇస్తానని పేర్కొన్నారు. నడిఘర్ సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉన్న పద్మిని, తమిళ ధారావాహికలను నిర్మిస్తున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, జెమిని గణేశన్, ఎంజీఆర్ సరసన నటించారు.
చెన్నైలో ఓ కార్రక్రమంలో పాల్గొన్న ఆమె శ్రీరెడ్డితో కలిసి పనిచేయాలని ఉందని తెలిపారు. కాస్టింగ్ కౌచ్ అనేది 1980 నుంచే ఉందని, ఇప్పుడు శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలలో 100 శాతం నిజం ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో ఆమెకు అండగా నిలవాలని, ఒక్క అవకాశం ఇస్తే.. తనను తాను నిరూపించుకుంటుందని, తాను నిర్మించే ధారా వాహికలలో మంచి పాత్రలు ఇస్తానని చెప్పుకొచ్చారు.
శ్రీరెడ్డి తమిళ సినీ ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, పలువురు తనని వాడుకుని అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని సోషల్ మీడియా వేదికగా గతకొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం టాలీవుడ్ లో పలువురిపై ఆరోపణలు చేసిని శ్రీరెడ్డి.. ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.