మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సిఎం కేసీఆర్ ప్రకటించారు.ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేశారు. స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్..
పేరు..కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
S/౦.జంగారెడ్డి….
సతీమణి.. అరుణ..
కుమారుడు.. కుసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి..కోడలు. స్రవంతి,,….
కూతురు రమ్య…అల్లుడు శ్యాం సుందర్ రెడ్డి..
గ్రామం….లింగవారి గుడం…
మండలం.. నారాయణ పురం.. యాదాద్రి జిల్లా..
విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకoగా పని చేసి,,,కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉద్యమం లోకి వచ్చారు. 2003 నుంచి TRS లో క్రియాశీలక పాత్ర. …..మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి గా పనిచేశౄరు. 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి టీఆర్ఎస్ నుండి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.