‘ఖుషీ’ సెన్సార్ పూర్తి..రన్ టైమ్‌ అంతే

43
- Advertisement -

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ మూవీ ట్రైలర్‌కు సెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుండగా.. ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ మేరకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవగా.. రన్ టైమ్‌ను 2.41 నిమిషాలకు లాక్ చేశారు. ఇక సెన్సార్ బోర్డ్ జారీచేసిన సర్టిఫికెట్‌ను షేర్ చేసిన విజయ్.. ‘లాక్డ్ అండ్ సెన్సార్డ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అన్నట్టు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

కాగా ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అన్నట్టు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ ఖుషి చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఐతే, ‘విజయ్ దేవరకొండ’ను లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డంగా ముంచింది. పైగా విజయ్ దేవరకొండ మార్కెట్ పై కూడా లైగర్ ఎఫెక్ట్ బాగా పడింది. మరోపక్క హీరోయిన్ స‌మంత క్రేజ్ కూడా ఇప్పుడు బాగా తగ్గింది. మరి ఈ నేపథ్యంలో ఖుషి కి ఓపెనింగ్స్ ఎంతవరకు వస్తాయి అనేది పెద్ద డౌట్ గా మారింది.

ఒకవేళ ఓపెనింగ్స్ రాకపోతే. ‘ఖుషి’ సినిమా పరిస్థితి ఏమిటి ?, మైత్రీ మూవీ మేకర్స్ కు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇటు ‘లైగర్’ డిజాస్టర్‌ తో రేసులో వెనకబడ్డ విజయ్‌‌ దేవరకొండ కు, అలాగే అటు మానసికంగా డిస్టర్బ్ అయిన సమంత కు కూడా ఈ ‘ఖుషి’ చిత్రం చాలా కీలకం కానుంది. మరి ఖుషి ఎంతవరకు ఖుషి చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడ్కర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read:అడ్డురసం మొక్కతో.. ఆ రోగాలు మాయం!

- Advertisement -