ఈరోజు BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ గద్వాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ… సీడు పత్తి కంపినీలు,ఆర్గనైజర్లు ఒక ముఠాగా ఏర్పడి సీడు పత్తి రైతులు వారు పండించిన పంటను పాస్ అయినప్పటికీ ఫెయిల్ చేస్తూ రైతులను మోసం చేసిన సీడ్ కంపినీలపై, ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని ఈనెల 10 వ తేదీన హైద్రాబాద్ లో రైతు కమీషన్ కు పిర్యాదు చేస్తే మా BRS పార్టీ పిర్యాదుకు స్పందించి నిన్న రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు జోగులాంబ గద్వాల జిల్లాకు వస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు సీడు పత్తి రైతుల సమస్యను పక్కదారి పట్టించే విదంగా కాంగ్రెస్ పార్టీ కార్యాక్రమంలాగా కాంగ్రెస్ పార్టీ జెండాలను,కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ర్యాలీ లాగా చేసి రైతులను మోసం చేసే కుట్ర చేశారు అని అన్నారు.
సీడు పత్తి రైతులకు అన్యాయం చేసే విదంగా కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయిన జిల్లా కాంగ్రెస్ నాయకులు,సీడు కంపినీలు,సీడు ఆర్గనైజర్లు,అధికారులు కుమ్మక్కయి ఒక ముఠాగా ఏర్పడి సీడు పత్తి రైతులకు జరుగుతున్న మోసాలను రైతులు రైతు కమీషన్ దృష్టికి తీసుకుని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నల్లారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు రైతు కమీషన్ చుట్టూ ఉంటు రైతుల పక్షాన రైతులను తీసుకొని మేము అక్కడికి పొతే కొంతమంది రౌడీలు తప్పతాగి వచ్చి రైతులమీదికి ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవనే విదంగా వ్యవహరించారన్నారు.
సమస్య ఉన్న ధరూర్,మల్దకల్,గట్టు ,KT దొడ్డి మండలాల్లో జరగాల్సిన కమీషన్ పర్యటన ను సంబందం లేని పూటాంపల్లి గ్రామానికి మార్చారు. ముందస్తు పథకం ప్రకారం కమీషన్ ను పక్కదారి పట్టించేవిదంగా వ్యవహరించారు. గౌరవ మాజీ శాసనసభ్యులు సంపత్ గారికి నిన్న రైతు కమీషన్ చైర్మన్ పర్యటించిన పుటాన్ పల్లి గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర రైతు కమీషన్ కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అట్టి కమీషన్ క్వాసీ జ్యూడిషియల్ అథారిటీ అయినా అక్కడికి వచ్చి గొడవ చేశాడు.
జిల్లా పోలీసు అధికారులు అధికారపార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తే వారిగా అయ్యారు.గొడవ చేసిన కాంగ్రెస్ గుండాలను వదిలేసి రైతు సమస్యలు లేవనెత్తిన మేము కమీషన్ ముందు మావాదనలను వినిపించకుండా మా BRS పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని మమ్మలను రైతులను అక్రమంగా అరెస్టు చేశారు.
ఒకవేళ పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మీద అంత ప్రేమ ఉంటె మూడు సింహాలు ఉన్న టోపీ,ఖాకి డ్రెస్ తీసివేసి కాంగ్రెస్ పార్టీ జెండాలను కుట్టించుకోవాలని BRS పార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.ఆలంపూర్ ప్రజలు ఛీ కొట్టినా,బొండకేసి బొక్కబోర్లా పడేసినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్న సంపత్.. జాగ్రత్త..దమ్ము ఉంటె గతంలో నీకు ఓట్లు వేసి ఎమ్మెల్యే గా ఎన్నోకొని నీకు రాజకీయ బిక్ష పెట్టిన రాజోలి మండలంలోని ఏ గ్రామానికి అయినా వెళ్లే దమ్ము ఉందా అని అడుగుతున్నాం..అక్కడ చెల్లని రూపాయ ఇంకోదగ్గర చెల్లుబాటు అవుతుందా…?,త్వరలోనే నీ ల్యాండ్,సాండ్, మైనింగ్ మాఫియా గురించి బయట పెడతాం.ఏపని కావాలన్న సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకోసం రాత్రిబవళ్ళు కష్టపడిన కాంగ్రెస్ నాయకులతో కూడా పెర్సన్టేజీలు తీసుకునే వ్యక్తిత్వం నీది..జిల్లా రెవెన్యూ అధికారులు కూడా సంపత్ వల్ల పోస్టింగ్ లు తెచ్చుకున్న కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను అప్పనంగా దారాదత్తం చేసి అక్రమ రిజిస్ట్రేషన్ లు కూడా చేశారు.కచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో మా BRS ప్రభుత్వం రాబోతుంది మీరు తీసుకున్న అన్ని నిర్నాయాలమీద విచారించి మీరు ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చి రికవరీ చేపిస్తాం అన్నారు.
గద్వాల జిల్లాలో సీడు పత్తి రైతులు వారి సమస్యల కోసం రోడ్ల మీదకు వస్తుంటే కనీసం ఒక్క నాయకుడైన వారి గురించి పట్టించుకున్నారా…?,కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం…తక్షణమే సీడు పత్తి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తాం.అవసరమైతే రైతుల పక్షాన BRS పార్టీ తరుపున రాష్ట్ర ఉన్నత న్యాయస్థనం హైకోర్టును కూడా ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగిలే కృషి చేస్తాం అన్నారు.
Also Read:విమాన ప్రమాదం..బాధ్యులపై కఠిన చర్యలు!

