బడా సినిమాల రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎనౌన్స్ చేసిన డేట్ కి స్టార్ హీరోల సినిమాలు రావన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా కొత్తేం కాదు. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా అదే రీతిలో వాయిదాలు వేసుకుంటున్నాయి.
తాజాగా బెల్లం కొండ సాయి గణేష్ నటించిన ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాను మార్చి 10 న రిలీజ్ అంటూ ప్రకటించారు. రిలీజ్ డేట్ తో ప్రమోషన్ మొదలెట్టి కొంత హంగామా చేశారు. కానీ ఇప్పుడు ఏమైందో కానీ ఆ డేట్ కి సినిమాను రిలీజ్ చేయడం లేదు. ఈ సినిమా విడుదల ను వాయిదా వేసుకున్నారు. స్టూడెంట్స్ చూడాల్సిన ఈ సినిమాను స్టూడెంట్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకుని వారి కోసం పోస్ట్ పోన్ చేస్తున్నామని , వేసవి సెలవుల్లో కలుసుకుందామని చెప్తూ మేకర్స్ పోస్ట్ పోన్ విషయాన్ని చెప్పారు.
నాంది నిర్మాత సతీష్ వేగేశ్న నిర్నిసున్న ఈ సినిమాతో తేజ శిష్యుడు రాకేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్టూడెంట్ మొబైల్ రాబరీ నేపథ్యంతో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి…