మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ రేపే థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయితే ఈ సినిమా కోసం విశ్వక్ లాస్ట్ మినట్ ప్రమోషన్స్ చేశాడు. తనే డైరెక్టర్ కావడంతో హీరోగా అగ్రెసీవ్ ప్రమోషన్స్ చేయలేకపోయాడు. దీంతో ధమ్కీ కి ఆశించిన బుకింగ్స్ లేవు. రేపు ఈ సినిమాకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇక విశ్వక్ ఇదేం మొదటి సారి కాదు తను చేసిన ఏ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా రెండో రోజు నుండి ప్రేక్షకులను రాబట్టగలిగింది. ఇక ఓరి దేవుడా కి కూడా మినిమం ఓపెనింగ్స్ రాలేదు. అనిరుద్ సాంగ్ పాపులర్ అయినా , టీజర్, ట్రైలర్ ఎట్రాక్ట్ చేసినా , వెంకటేష్ సపోర్ట్ ఉన్నా దానికి కలెక్షన్ రాలేదు. పైగా టాక్ తేడా కొట్టడంతో సినిమా మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది.
ధమ్కీ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చినా, సాంగ్స్ బాగున్నా విశ్వక్ మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం బుకింగ్స్ డల్ గా కనిపిస్తున్నాయి. మరి టాక్ బాగుంటే కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్టవ్వడం విశ్వక్ కి చాలా ముఖ్యం. అతని మార్కెట్ , లైనప్ , రెమ్యూనరేషన్ , ప్రొడక్షన్ అంతా ఈ సినిమా మీదే ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి…