- Advertisement -
కర్నూలులో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుట్టపాడు, ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటుకానుంది పరిశ్రమ. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ కు అనుమతించింది.
రూ.22,976 కోట్ల పెట్టుబడితో 1,241 ఉద్యోగాలిచ్చేలా పరిశ్రమ ఏర్పాటు కానుంది. 150 ఎకరాల భూమిలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎకరం రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు అనుమతించింది.
Also Read:ఆస్పత్రిలో చేరిన నటుడు గోవిందా
ఎస్ఐసీ డివైజ్, డిస్క్రీట్, మాడ్యూల్ ప్యాకేజింగ్ సెమీకండక్టర్లు తయారు చేయనుంది ఈ సంస్థ. ఏపీ సెమీ కండక్టర్, డిస్‌ప్లే ఫాబ్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు మంజూరు చేయగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎస్, ఏపీఐఐసీ ఎండీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -

