Mro విజయారెడ్డిని హత్య చేసిన రైతు సురేష్ మృతి

463
SURESH
- Advertisement -

 అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడు రైతు సురేష్ మృతి చెందాడు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రైతు సురేష్ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.ఈ నెల 4వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేష్‌ పెట్రోల్‌ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే.

విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటిన అనంతరం తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తొంగిపోయాడు సురేష్. పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోక ముందు నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.

కొంతకాలంగా భూపట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని, అయితే ఆమె సహకరించకపోవడంతో ఈ పని చేసినట్లు చెప్పాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్లే తన కుటుంబం రోడ్డున పడిందని చెప్పుకొచ్చాడు. ఈ కారణంతోనే విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు తెలిపాడు.

- Advertisement -