కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్?

95
- Advertisement -

కుంకుడుకాయ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. పూర్వం నుంచి కూడా వీటి యొక్క రసాన్ని జుట్టుకు షాంపులా ఉపయోగిస్తూ వస్తున్నారు. జుట్టుకు అత్యంత సహజసిద్దంగా పోషణ అందించడంలో కుంకుడు అంతగానో ఉపయోగ పడుతుంది. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడు కాయకు బదులుగా రకరకాల షాంపులను వాడుతున్నాము. అయితే రసాయనిక మిశ్రమలు కలిగిన షాంపులు వాడడం వల్ల జుట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. వయసు తో సంబంధం లేకుండా తెల్ల జుట్టు రావడం, బట్టతల రావడం వంటి సమస్యలతో పాటు, జుట్టు పలచబడడం, పొడి బారడం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. .

ఈ నేపథ్యంలో సహజసిద్దంగా జుట్టుకు పోషణను అందించేందుకు కుంకుడు కాయ రసం ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కుంకుడు కాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు, దురద, స్కాల్ఫ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. స్కాల్ఫ్ పై ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్యలు పెరుగుతాయి. అందువల్ల స్కాల్ఫ్ ను పూర్తిగా నివారించడంలో కుంకుడు కాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుంకుడుకాయలు హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్ లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు డ్రైగా మారకుండా చూస్తుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందించి దృఢంగా మరుస్తాయి. కుంకుడు కాయ రసంతో తరచూ తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా మారడంతో పాటు ఆకర్షణీయంగా తయారవుతుంది.

Also Read:మార్నింగ్ వాక్..అనేక రోగాలకు చెక్!

- Advertisement -