కరాటే కింగ్ జాకీచాన్, సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ కాంబినేషన్‌లో స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’. ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై కల్పన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ జనవరి 27న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో జరిగింది.
ప్రముఖ రచయిత జె.కె.భారవి మాట్లాడుతూ – ”జాకీచాన్ ఫైట్స్‌ని ఎంత ఈజీగా చేస్తారో.. అంత ఈజీగా డ్యాన్స్ కూడా ఈ చిత్రంలో చేసారు. నాకు బాగా ఇష్టమైన నటుడు ఆయన. జాకీచాన్‌తో ఎప్పటికైనా సినిమా తియ్యాలని నా కోరిక. మనకు వేదాలు నాలుగు రకాలు వున్నాయి. అందులో మొదటిది అధర్వణ వేదం. యుద్ధాలు, యాక్షన్‌కి సంబంధించినది అధర్వణ వేదం. దీంతో ఒక సబ్జెక్ట్‌ని రెడీ చేశాను. జాకీచాన్‌కి ఈ కథ చెప్పి అద్భుతమైన సినిమా తియ్యాలనుకున్నాను. కానీ ‘కుంగ్ ఫూ యోగ’ పేరుతో నా కోరికను సగం తీర్చింది కల్పన. నా చిన్నతనంలో కల్పన నాన్నగారు కల్పన చిత్ర బేనర్‌లో ‘మా వదిన’, ‘అత్తగారు-కొత్తకోడలు’ వంటి హిట్ సినిమాలు ఎన్నో నిర్మించారు. వారి తండ్రి ఆశయాన్ని కంటిన్యూ చేస్తూ కల్పన ఎన్నో సినిమాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు కల్పన. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సి.ఇ.ఓ. శైలేష్ మాట్లాడుతూ – ”’కుంగ్ ఫూ యోగ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేయడం చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. జాకీచాన్, సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆర్.కె.భగవాన్ కల్పనగారిని ఇంట్రడ్యూస్ చేశారు. మంచి టేస్ట్ వున్న నిర్మాత. కల్పన చిత్ర బేనర్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న గొప్ప చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు.
ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ”ప్రపంచస్థాయి నటుడు జాకీచాన్. ఇండియన్ యాక్టర్ సోనూసూద్ కాంబినేషన్‌లో కల్పన అందిస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది” అన్నారు.
డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ – ”కుంగ్ ఫూ యోగ’ చిత్రాన్ని సౌత్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాననిక ల్పన కాల్ చేసి చెప్పగానే ఈ చిత్రం గురించి నెట్‌లో సెర్చ్ చేశాను. చాలా రోజుల తర్వాత జాకీచాన్ అత్యంత భారీ బడ్జెట్‌తో స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇండో-చైనా సంబంధాలు బెటర్‌గా వుండాలని ఈ సినిమా చేశారు. బిగ్ ప్యాడింగ్‌తో, లాటాఫ్ యాక్టర్స్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. అన్ని లాంగ్వేజెస్‌లో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. జాకీచాన్ 150 సినిమాలు చేశారు. ఇంకా అదే ఎనర్జీ, అదే ఉత్సాహంతో ఈ సినిమా చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా అంతా ఎంజాయ్ చేసేవిధంగా వుంటుంది. మా కల్పనకి ఈ సినిమా బిగ్ హిట్ కావాలి” అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శక్తి రమేష్ మాట్లాడుతూ – ”ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలేష్ మంచి స్నేహితుడు. జాకీచాన్‌గారి 150వ సినిమా మా బేనర్‌లో రిలీజ్ చేశాం. ‘కుంగ్ ఫూ యోగ’ భారీ బడ్జెట్ చిత్రం. సోనూసూద్ ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలి” అన్నారు.
ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ – ”తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వరుస సక్సెస్‌లు సాధిస్తున్నారు కల్పన. తండ్రికి తగ్గ తనయురాలిగా డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటి సినిమాని సౌత్ ఇండియా మొత్తం కల్పన రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయం. జాకీచాన్-సోనూసూద్‌లకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వుంది. ట్రైలర్ అద్భుతంగా వుంది. స్ట్రెయిట్ చిత్రంలా ఈ చిత్రాన్ని ఆదరిస్తారు ప్రేక్షకులు” అన్నారు.
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ – ”మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి కల్పన ‘కుంగ్ ఫూ యోగ’ చిత్రాన్ని సౌత్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలు మూడు జోనర్స్‌లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. జేమ్స్‌బాండ్‌లాంటి అడ్వంచెరస్ చిత్రాలు, డిజ్‌ల్యాండ్ వంటి పిల్లలకు నచ్చే చిత్రాలు, జాకీచాన్ నటించిన చిత్రాలు నిజంగా సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా పిల్లలతో పాటు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. జాకీచాన్ నటించిన ఈ చిత్రంలో సోనూసూద్, అమైరా దస్తూర్, ఇండియన్ యాక్టర్స్ నటించడం, ఆ కంపెనీ షేరింగ్‌లో కల్పన భాగస్వామి కావటం చాలా హ్యాపీగా వుంది. దిశా పటానిని హీరోయిన్‌గా ‘లోఫర్’ చిత్రంతో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అవుతుంది. సోనూసూద్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలి.. ప్రేక్షకులు తప్పకుండా సూపర్‌హిట్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరోయిన్ అమైరా దస్తూర్ మాట్లాడుతూ – ”ట్రైలర్స్, సాంగ్స్ ఫెంటాస్టిక్‌గా వున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎగ్జైటింగ్‌గా వుంది. తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించాను. జాకీచాన్ వంటి గొప్ప నటుడితో ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ ఈ సినిమాకి కష్టపడి వర్క్ చేశారు. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది” అన్నారు.
నటుడు సోనూసూద్ మాట్లాడుతూ – ”తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ నాకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు పరిశ్రమలోనే. నా కోసం అవకాశాన్ని కల్పించిన, మంచి క్యారెక్టర్స్ రాసిన రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి నా థాంక్స్. తెలుగు సినిమాల్లో నటించి చాలాకాలం అయ్యింది. ఇక నుండి రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చేస్తాను. లెజెండరీ యాక్టర్ జాకీచాన్‌గారితో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. నన్ను నమ్మి జాకీచాన్‌గారు నాకు మంచి క్యారెక్టర్‌ని చేసే అవకాశం కల్పించారు. వెరీ కమిట్‌మెంట్. హార్డ్ వర్కింగ్ యాక్టర్. యాక్షన్‌తో పాటు, డ్యాన్స్‌లు కూడా అమేజింగ్‌గా చేశారు. ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాను. చాలా టిప్స్ చెప్పారు ఫైట్స్‌లో. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. అమైరా బ్రిలియంట్ యాక్టర్. బ్యూటిఫుల్‌గా ఈ చిత్రంలో నటించింది. దుబాయ్, ఐస్‌లాండ్, మాల్దీవులు, ఇండియా, అరబ్ కంట్రీస్‌లో షూటింగ్ చేశాం. కార్ ఛేజింగ్ సీన్స్ 28 రోజుల్లో పూర్తి చేశాం. ఈ ఎపిసోడ్ చాలా హైలైట్‌గా అవుతుంది. ఫస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ విని చాలా థ్రిల్ ఫీలై రియలైజ్ అయ్యాను. డైరెక్టర్ స్టాన్లీ బ్రిలియంట్ డైరెక్టర్. ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. సౌత్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న కల్పనగారికి థాంక్స్” అన్నారు.
ఈ కార్యక్రమానికి నటుడు సోనూసూద్, హీరోయిన్ అమైరా దస్తూర్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, సికె. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. అధినేత సి.కళ్యాణ్, ప్రముఖ నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామసత్యనారాయణ, శక్తి రమేష్, రాంప్రసాద్, ఆర్.కె.భగవాన్, ప్రముఖ రచయిత జె.కె.భారవి, టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సి.ఇ.ఓ. శైలేష్ తదితరులు పాల్గొన్నారు.