కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. హైదరాబాద్ ముగ్దూం భవన్‌లో మీడియాతో మాట్లాడిన కూనంనేని.. ప్రజా ప్రతినిధులు ఫోన్ లు ఎత్తడం లేదు.సిస్టం ఫాలో అవడం లో ప్రభుత్వం విఫలమయ్యింది.ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు..కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి వస్తే పోటీ చేస్తాము…లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మేము మద్దతు ఇచ్చాము..టిచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పై మా అనుబంధ సంఘాల వాళ్ళు చర్చలు జరుపుతున్నారు..బీజేపీ తో కాకుండా మిగతా కలిసి వచ్చే పార్టీ లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాము..ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ప్రజాస్వామ్యం నెట్టి వేయబడుతోందన్నారు.
పరిపక్వత లోపం వల్ల ఇండియా కూటమి విచ్ఛిన్న దశకు చేరుకున్నది… ఢిల్లీ విజయంతో సంఘ్ పరివారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. శ్రీ రాముడు జయంతి రోజే మోహన్ భగవత్ చేసిన వాఖ్యలు దురదృష్టకరం… బీజేపీ వాళ్ళు ఏదో రకంగా మతం, దేవుడు అంటూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు అన్నారు. మతపరమైన రాజకీయాలను అడ్డుకోవడంలో లౌకిక శక్తులు విఫలం అవుతున్నాయి అన్నారు.
కేజ్రీవాల్ ను బయపెట్టించి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. హిందుత్వం ముసుగున బీజేపీ ఎవరికి మేలు చేస్తుందన్నారు. 99 శాతం హిందువుల శ్రమను దోచుకొని అంబాని, ఆదాని ల చేతుల్లో పెట్టడం హిందుత్వం అవుతుందా.?, రామా రాజ్యం పేరుతో రంగరాజన్ పై దాడి చేశారు.. దేశ వ్యాప్తంగా రామరాజ్యం సోకాల్డ్ లు చాలా మంది మేధావులను పొట్టన పెట్టుకున్నారు అన్నారు.
రంగ రాజన్ పై దాడి చేస్తే విశ్వ హిందు పరిషత్ ఏం చేస్తోంది..రామరాజ్యం పేరుతో దాడులకు దిగుతున్న సోకాల్డ్ లకు సంఘ్ శక్తులే ప్రేరణగా నిలుస్తున్నాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఉదరావాదంతో ఉండకపోతే బీజేపీ హిందుత్వ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది… 146 మంది భారతీయుల చేతులకు బేడీలు వేసి అవమానించిన ట్రాంప్ తో మోడీ ఆలింగనం చేస్తుకుంటున్నారు అన్నారు.
మోడీ దేశానికి ఏం సంకేతాలు ఇవ్వడలుచుకున్నారు..ఇండియన్స్ బంధించబడితే అమెరికా సిస్టం అదే అంటూ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడటం దేనికి నిదర్శనం,అమెరికాలో ఉన్న భారతీయులు తీవ్రవాదులా..? హిందువులు కాదా..?,గల్ఫ్ లో కూడా అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.