సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని..

75
sambhashivarao
- Advertisement -

హైదరాబాద్ శంషాబాద్ వేదికగా జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు కూనంనేని సాంబశివరావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు చాడ వెంకట్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశముండగా ఆయన విముఖత చూపడంతో కొత్తవారి ఎన్నిక అనివార్యమైంది.

సీనియర్ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు మధ్య పోటీ నెలకొనగా చివరగా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో సాంబశివరావుకు 59, పల్లాకు 45 ఓట్లు రావడంతో నూతన రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నికయ్యారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు కూనంనేని. స్వరాష్ట్ర సాధనలో ఆమరణదీక్ష చేశారు.

- Advertisement -