Pawan:ఏపీకి కుంకీ ఏనుగులు

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ఐదు కుంకీ ఏనుగులు రానున్నాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నారు. వాటి పేర్లను చూస్తే రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర.

ఏపీలో కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల పక్కన ఉన్న పంట పొలాల్లోకి చొచ్చుకొని వెళ్లి నష్టం కలిగించడమే కాదు, గ్రామాలపై కూడా దాడులకు తెగబడి, అనేక మంది రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలితీసుకున్నాయి ఏనుగుల గుంపులు.

ఈ తరహా ఘటనలతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న రైతులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గమనించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కీలక చర్య తీసుకున్నారు.

Also Read:కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం:ఏపీ

- Advertisement -