కుంబ్లే..టీమిండియా బెస్ట్ కెప్టెన్

276
gambir
- Advertisement -

తన దృష్టిలో అనిల్ కుంబ్లే బెస్ట్ కెప్టెన్‌ అని వెల్లడించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. రికార్డుల పరంగా ధోని అత్యుత్తమం కానీ కుంబ్లేనే బెస్ట్ అని పేర్కొన్నాడు.

ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన గంభీర్ కుంబ్లే కెప్టెన్సీలో కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడాడు. ఒకవేళ అతను లాంగ్ టైమ్ కెప్టెన్‌గా ఉండింటే..? చాలా రికార్డులు బద్దలయ్యేవని వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ కూడా అద్భుతంగా రాణించాడని తెలిపాడు.

ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన గౌతమ్ గంభీర్.. రెండు టోర్నీ ఫైనల్లో భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే ధోని, విరాట్‌ కెప్టెన్సీలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే గంభీర్…తాజాగా మరోసారి తన మనసులోని మాటలను భయటపెట్టాడు.

- Advertisement -